News November 19, 2025
కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలనుకున్న హిడ్మా?

AP: వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో దండకారణ్యం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కొద్దిమంది అనుచరులతో కలిసి శ్రీలంకలో తలదాచుకోవాలని భావించాడని సమాచారం. కాకినాడ పోర్టు నుంచి సముద్రమార్గంలో వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో దండకారణ్యం నుంచి బయటికొచ్చిన హిడ్మా మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని తెలుస్తోంది.
Similar News
News November 22, 2025
షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్‌లో శ్రద్ధా నటిస్తున్నారు.
News November 22, 2025
6 నెలల్లో అమరావతి రైతుల సమస్య పరిష్కారం: కమిటీ

AP: అమరావతి రైతుల సమస్యలను 6నెలల్లోగా పరిష్కరిస్తామని త్రీమెన్ కమిటీ హామీ ఇచ్చింది. 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఇంకా 700 ఎకరాలపై సమస్య ఉందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పరిశీలన తర్వాత జరీబు, మెట్టభూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. లంకభూములపై గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు FEBలో వచ్చే అవకాశముందన్నారు. 719 మందికి మాత్రమే ఇంకా ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ చెప్పారు.
News November 22, 2025
యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్‌ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.


