News November 11, 2024
కాకినాడ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. యాజమాన్యం సీరియస్
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. మద్యం తాగి జగదీశ్ అనే సీనియర్ విద్యార్థి పది మంది జూనియర్లను కారిడార్‌లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో వారు తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన యాజమాన్యం హౌస్ సర్జన్ జగదీశ్ ను ఏడాది పాటు సస్పెండ్ చేసి, రూ. 25 వేలు అపరాధ రుసుం విధించింది.
Similar News
News November 21, 2024
శాసనమండలిలో భూ సమస్యలపై MLC వెంకటేశ్వరరావు గళం
శాసనమండలిలో భూ సమస్యలపై తూ.గో, ప.గో జిల్లాల పట్టభధ్రుల MLC వెంకటేశ్వరరావు గళం వినిపించారు. ఆన్‌లైన్‌లో భూమి రకం, విస్తీర్ణాలు తప్పుల తడకగా చూపిస్తున్నాయని అన్నారు. అంతే కాకుండా తక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువ భూమి చూపిస్తూ ఉండడంతో వారు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారని ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య తీరడం లేదన్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.
News November 21, 2024
తూ.గో జిల్లాలో దొంగతనాలు..అరెస్ట్ చేస్తారని సూసైడ్
అరెస్ట్ భయంతో తిరుపతిలో సూర్యప్రభాశ్(20) ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. ఇతనిపై రాజమండ్రిలో దొంగతనం కేసులు నమోదవ్వగా తిరుపతికి పారిపోయాడు. లక్కవరం ఎస్సై రామకృష్ణ, జంగారెడ్డిగూడెం క్రైం ఏఎస్సై సంపత్ కుమార్ తమ సిబ్బందితో తిరుపతికి వెళ్లారు. పోలీసులను గమనించి అతను గడియ పెట్టుకొని.. అరెస్ట్ చేస్తారనే భయంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. రుయాకు తరలిస్తుండగా మృతి చెందాడు.
News November 21, 2024
ఎన్నికల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి: కలెక్టర్ ప్రశాంతి
ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలక్టరేట్‌లో ఏఆర్వో, సహాయ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్ రోజున విధులు నిర్వహించే విధానాల పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వమించారు. కలెక్టర్ డీఆర్వో ఎమ్మెల్సీ ఎన్నికలలో సంబంధిత అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వివిధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.