News October 26, 2025

కాకినాడ: రామురామంటూనే.. ఎట్టకేలకు తిరిగొచ్చారు.!

image

తుపాన్ నేపథ్యంలో తాళ్లరేవు మండలం హోప్ ఐలాండ్‌లో ఉన్న 110 మంది మత్స్యకారులను తీసుకువచ్చేందుకు కాకినాడ ఆర్డీఓ, పోలీసులు సహా 20 మంది అధికారులు ఆదివారం ఉదయం వెళ్లారు. మొదట తాము రామని మత్స్యకారులు చెప్పినా, అధికారులు ఎట్టకేలకు వారికి నచ్చజెప్పారు. సాయంత్రం అందరూ తూరంగిలోని హోప్ ఐలాండ్ కాలనీకి సురక్షితంగా తిరిగి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News October 27, 2025

సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించాం: నాదెండ్ల

image

AP: సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించిన ఏకైక పార్టీ జనసేన అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొట్టే సాయిని శ్రీకాళహస్తి ఆలయ బోర్డు ఛైర్మన్‌గా ఎంపిక చేయడం దీనికి నిదర్శనమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యువతకు తగిన అవకాశం కల్పించాలని Dy.CM పవన్ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలన్నదే జనసేన లక్ష్యమని ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు.

News October 27, 2025

తిరుపతి జిల్లాలో మూడు రోజులు సెలవుల

image

తుఫాను నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ డా. వెంకటేశ్వర్ 3 రోజులపాటు సెలవులు ప్రకటించారు. సోమవారం నుంచి బుధవారం వరకు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 27, 2025

పర్యాటకులకు బాపట్ల ఎస్పీ సూచనలు

image

కార్తీక సోమవారం సందర్భంగా బాపట్ల జిల్లాలోని సముద్ర తీరాలకు పల్నాడు, గుంటూరు, తెలంగాణ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని సముద్ర తీరాలను మూసివేసినట్లు ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదివారం తెలిపారు. భక్తులు, పర్యాటకులు సముద్ర తీరాలకు వెళ్లకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.