News December 18, 2025

కాకినాడ రూరల్‌పై మాజీ మంత్రి కన్ను

image

తాళ్లరేవు నియోజవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రిగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన చిక్కాల రామచందర్రావు ఓసారి రామచంద్రపురంలో పోటీ చేసి ఓటమి చెందారు. టీడీపీకి వీర విధేయుడు. తాజాగా ఆయన కాకినాడ రూరల్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గానికి నాలుగేళ్ల నుంచి ఇన్‌ఛార్జ్ లేరు. దీంతో ఆయన రూరల్ పగ్గాలు చేపట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Similar News

News December 20, 2025

ఎల్లుండి నుంచి అకౌంట్లలోకి బోనస్ డబ్బులు

image

TG: రాష్ట్రంలో వరి సన్నాలు సాగు చేసిన రైతులకు బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24 లక్షల మంది రైతులకు బోనస్ కింద రూ.649 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం నుంచి చెల్లింపులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

News December 20, 2025

భారత్‌పై డికాక్ రికార్డు

image

టీమ్ ఇండియాపై T20Iల్లో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ నిలిచారు. ఇవాళ్టి మ్యాచులో ఫిఫ్టీతో కలుపుకొని భారత్‌పై 14 ఇన్నింగ్సుల్లోనే ఆరు అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో వెస్టిండీస్ ప్లేయర్ పూరన్(20 ఇన్నింగ్స్‌ల్లో 5), ఇంగ్లండ్ ప్లేయర్ బట్లర్ (24 ఇన్నింగ్స్‌ల్లో 5) ఉన్నారు.

News December 20, 2025

RJY: ఆర్ట్స్ కాలేజీలో కామర్స్ బ్లాక్‌ను ప్రారంభించిన లోకేశ్

image

రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థి, తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు రూ.42లక్షల విరాళంతో నిర్మించిన ‘స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్’ బ్లాక్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం తిరుమలరావు దాతృత్వాన్ని లోకేష్ కొనియాడారు. చదివిన విద్యాసంస్థలకు తిరిగి సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి, అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.