News December 8, 2025

కాకినాడ: రూ.కోటి దోచేసిన వారిపై చర్యలేవీ..?

image

డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ముకు భద్రత కరవైంది. కరప(M) కూరాడలో సుమారు రూ. కోటి నిధులు స్వాహా అవ్వగా కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి, ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారని మహిళలు మండిపడుతున్నారు. రాజకీయ జోక్యం, పీడీల మామూళ్ల పర్వంతో ఈ వ్యవస్థ అవినీతికి నిలయంగా మారిందని వాపోతున్నారు. కలెక్టర్ పారదర్శకంగా విచారణ జరిపి తమ సొమ్ము రికవరీ చేయాలని వారు కోరుతున్నారు.

Similar News

News December 11, 2025

పెద్దపల్లి: ఈనెల 21న జాతీయ లోక్‌ అదాలత్‌

image

ఈనెల 21న పెద్దపల్లి జిల్లాలోని అన్ని కోర్టులలో లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా లోక్‌ అదాలత్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. కక్షిదారులు తప్పనిసరిగా తమ తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.భవానీ ఉన్నారు.

News December 11, 2025

‘అఖండ-2’ విడుదల: దెబ్బ మీద దెబ్బ

image

‘అఖండ-2’ సినిమాకు వరుస అడ్డంకులు ఎదురవుతుండటం నిర్మాతలు, ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. డిస్ట్రిబ్యూటర్ ఆర్థిక లావాదేవీల <<18474420>>సమస్యతో<<>> ఈ నెల 5న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తాజాగా ప్రీమియర్ షో టికెట్ల ధర పెంపు జీవోను TG హైకోర్టు సస్పెండ్ చేయడంతో అదనపు ఆదాయం పొందాలనుకున్న నిర్మాత ఆశలు అడుగంటాయి. కాగా ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి రిఫండ్ అవుతుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

News December 11, 2025

5 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు

image

SIR గడువు వారం రోజులు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత CEOల వినతులతో గడువు పొడిగించినట్టు తెలిపింది. యూపీ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్‌లో మరో వారంపాటు SIR కొనసాగనుంది. కాగా గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్, రాజస్థాన్, వెస్ట్‌ బెంగాల్‌లో ఈరోజుతో SIR ముగియగా DEC 16న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ కానుంది.