News September 28, 2024

కాకినాడ: ‘రూ.11 లక్షలకు రూ.43 లక్షల వడ్డీ’

image

రూ.11 లక్షల రుణం తీసుకుంటే రూ.43 లక్షలు కట్టాలంటున్నారని కాకినాడ జిల్లాకు చెందిన ఓ మహిళ మంత్రి నారా లోకేశ్‌కు ప్రజా దర్బార్‌లో వినతిపత్రం అందజేశారు. కుటుంబ అవసరాల కోసం రూ.11 లక్షల రుణం తీసుకున్నామని, డాక్యుమెంట్ తనఖా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి సేల్ డీడీ రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు వడ్డీతో సహా రూ.43 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 22, 2026

రాజమండ్రి: కలెక్టర్ ప్రకటన.. రేపు యథావిధిగా..

image

తూ.గో. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక), రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డివిజన్, మండల స్థాయిలలో కూడా మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆయా ప్రధాన కార్యాలయం నుంచి హాజరావుతారని వెల్లడించారు.

News February 22, 2026

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: SP

image

తూ.గో జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల కోసం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SP నరసింహ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

News February 22, 2026

నల్లజర్ల: నడుచుకుంటూ వెళ్తూ వ్యక్తి మృతి

image

నల్లజర్ల మండలం ముసుళ్లకుంటలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలపారు. ఘటనా స్థలానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరణానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.