News October 19, 2025
కాకినాడ: రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమం రద్దయిన విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. అలాగే ప్రజలందరీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 19, 2025
భీమవరం: రేపు పీజీఆర్‌ఎస్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
News October 19, 2025
VJA: 21న APSSDC ఆధ్వర్యంలో కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో విజయవాడ MG రోడ్‌లోని జోయాలుక్కాస్‌లో ఈ నెల 21న జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాకు ఇంటర్, డిగ్రీ చదివిన 18-25 ఏళ్లలోపు అభ్యర్థులు హాజరు కావొచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుభూషణ్ తెలిపారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registrationలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ ద్వారా 500 ఉద్యోగాలను కల్పిస్తామన్నారు.
News October 19, 2025
పూతలపట్టులో చోరీ

పూతలపట్టు మండలం ఈ కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో రంగయ్య కుమారుడు పాటూరు దాము ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 60 గ్రాములు బంగారు, వెండి కాళ్లపట్టీలు మూడు జతలు, రూ.50 వేలు నగదు చోరీ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు దాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.