News April 21, 2024
కాకినాడ: రేపే చంద్రబాబు పర్యటన.. SP పర్యవేక్షణ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు కాకినాడ జిల్లా జగ్గంపేటలో పర్యటించనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి, సీఐ లక్ష్మణరావు, ఎస్ఐలు ఉన్నారు. హెలిప్యాడ్, రోడ్ షో నిర్వహించే ప్రాంతాన్ని సిబ్బందితో పరిశీలించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 11, 2025
యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు -DCHS ప్రియాంక

తూ.గో జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పరిధిలో ఉచిత వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని DCHS ప్రియాంక తెలిపారు. సమ్మె ప్రభావం కారణంగా జిల్లా ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకావొద్దన్నారు. సాధారణంగా ఉచిత వైద్య సేవలను పొందవచ్చునని తెలిపారు. రోగులకు ప్రతి విభాగంలో ఉచిత వైద్య సేవలు అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యలుంటే 9281068129, 9281068159 నంబర్లలో సంప్రదించాలన్నారు.
News October 10, 2025
తూ.గో జిల్లాలో ‘నూరు శాతం ఈ క్రాప్ పూర్తి’

తూ.గో జిల్లాలో వరి పంటకు నూరు శాతం ఈ క్రాప్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. రాజమండ్రి రూరల్ 16 , కొవ్వూరు 96, నల్లజర్ల 50, నిడదవోలు 20, గోపాలపురం 10, దేవరపల్లి 35, చాగల్లులో 25 ఎకరాల్లో వరి కోతలు పూర్తి చేశారన్నారు.
News October 10, 2025
గోదావరి పుష్కరాల యాక్షన్ ప్లాన్ సమావేశం

రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో గోదావరి పుష్కరాల యాక్షన్ ప్లాన్ మీటింగ్ గురువారం జరిగింది. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితతో మంత్రి కందుల దుర్గేశ్ సమావేశం నిర్వహించారు. ఈ పుష్కరాలు రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా, కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక ఉత్సవంగా జరుగుతాయన్నారు. అందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.