News January 5, 2026
కాకినాడ: లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ట్విస్ట్ ఏంటంటే!

తాళ్లరేవులోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. పాలకొల్లుకు చెందిన భాగ్యశ్రీ భర్త దుబాయ్‌లో ఉంటున్నారు, ఆమెకు బంధువు రమేశ్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఇది బయటపడడంతో వారు ఈ నెల 1న ఇంటి నుంచి పారిపోయారు. ఆదివారం తాళ్లరేవు లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 19, 2026
గర్ణికం: ‘టెన్త్ ఫలితాల్లో జిల్లా మొదటి స్థానానికి కృషి’

ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా మొదటి స్థానానికి ఎదిగేందుకు కృషి చేస్తున్నామని అనకాపల్లి జిల్లా డీఈవో అప్పారావు నాయుడు పేర్కొన్నారు. గర్ణికం కేజీబీవీ పాఠశాలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షల కోసం ఇచ్చిన 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. గత ఏడాది అనకాపల్లి జిల్లా 5వ స్థానంలో ఉందని.. మొదటి స్థానం సాధించేందుకు సహకరించాలన్నారు.
News February 19, 2026
వరంగల్: Way2News చొరవతో మహిళకు చికిత్స

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న వర్ధన్నపేట భవాని తండాకు చెందిన దేవిని గురువారం వైద్య సిబ్బంది బయటకు పంపారు. బాధితురాలు బయట ఏడుస్తున్న విషయాన్ని Way2News ఆసుపత్రి పీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించారు. బాధితురాలిని తిరిగి వార్డులో చేర్చుకొని చికిత్స అందించారు. విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది పేషెంట్‌కు మధ్య సమాచార లోపం వల్లే ఇది జరిగిందన్నారు.
News February 19, 2026
అజహరుద్దీన్ పదవికి గండం… AICCలో చర్చ

TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి అయ్యాక 6 నెలల్లో శాసనసభ/మండలిలో సభ్యుడు కాకపోతే పదవి కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఓ MLCతో రిజైన్ చేయించి ఆ స్థానంలో అజహర్‌ను ఎంపిక చేయాలని TPCC నేతలతో ఢిల్లీలో భేటీలో హైకమాండ్ సూచించింది. త్యాగం చేసే నేతకు ఇచ్చే పదవిపై నిర్ణయం జరగాల్సి ఉంది.


