News October 26, 2025

కాకినాడ: విద్యాసంస్థలకు ఐదు రోజుల సెలవులు

image

తుపాను నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 26వ తేదీ సాయంత్రం నాటికి ఇళ్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఐదు రోజులు ఏ ఒక్క విద్యాసంస్థ తెరిచి ఉండకూడదని, కళాశాలలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News October 26, 2025

చిన్నవయసులోనే వృద్ధాప్యమా?

image

వయసుతోపాటు వృద్ధాప్యం రావడం సహజమే కానీ చిన్నవయసులోనే ఈ లక్షణాలు కనిపించడం చాలామందిని ఇబ్బంది పెడుతోంది. దీనికి జెనెటిక్స్‌తో పాటు ఒత్తిడి, నిద్ర, ఆహారం, లైఫ్‌స్టైల్, అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం కారణాలంటున్నారు నిపుణులు. పోషకాహారం తీసుకోవడం, తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు మీకు నప్పే ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్‌, విటమిన్‌ C, నియాసినమైడ్‌ సీరమ్‌ వాడాలని సూచిస్తున్నారు.

News October 26, 2025

HYD: న్యూట్రిషన్ కోర్సులకు డిమాండ్.. యూనివర్సిటీలో ఛాన్స్!

image

ప్రస్తుత కల్తీ ఆహారం, న్యూట్రిషన్ లెస్ ఫుడ్ ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్న నేపథ్యంలో న్యూట్రిషన్ కోర్సులకు డిమాండ్ ఏర్పడింది. HYD అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. హోమ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో Ph.D సైతం చేసే అవకాశం ఉందని వివరించారు.

News October 26, 2025

SKLM: నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు

image

నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల31న జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంవద్ద ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలియజేశారు. ITI అర్హత కలిగి ఎలక్ట్రిషన్‌లో అనుభవం ఉండాలన్నారు. 30 ఏళ్లు కలిగి https://apssdc.inloలో నమోదు చేసుకోవాలన్నారు.