News August 20, 2024
కాకినాడ: వివాహిత, యువకుడి ఆత్మహత్య.. UPDATE

జగ్గంపేటలోని జగనన్న కాలనీలో ఓ ఇంట్లో వివాహిత, యువకుడు<<13894976>> ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. SI రఘునాథరావు వివరాల ప్రకారం.. జగ్గంపేటకు చెందిన నానాజీ (25), సాయిప్రసన్న(22) ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. నానాజీ తల్లిదండ్రులతో కలిసి స్థానిక టవర్ కాలనీలో ఉంటూనే, జగనన్న కాలనీలో సాయిప్రసన్నతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉరేసుకొని చనిపోయారు. కేసు నమోదుచేసి, విచారణ చేస్తున్నామని SI తెలిపారు.
Similar News
News February 22, 2026
రాజమండ్రి: కలెక్టర్ ప్రకటన.. రేపు యథావిధిగా..

తూ.గో. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక), రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డివిజన్, మండల స్థాయిలలో కూడా మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆయా ప్రధాన కార్యాలయం నుంచి హాజరావుతారని వెల్లడించారు.
News February 22, 2026
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: SP

తూ.గో జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల కోసం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SP నరసింహ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
News February 22, 2026
నల్లజర్ల: నడుచుకుంటూ వెళ్తూ వ్యక్తి మృతి

నల్లజర్ల మండలం ముసుళ్లకుంటలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలపారు. ఘటనా స్థలానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరణానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.


