News April 8, 2025

కాకినాడ: వీడు మామూలోడు కాదు..!

image

బిక్కవోలు జగనన్న కాలనీలో నిన్న ఓ యువకుడు గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. నర్సీపట్నానికి చెందిన సూర్యప్రకాశ్ 10వ తరగతి వరకు చదివాడు. కాకినాడ జిల్లా ఉప్పాడలోని ఓ చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ బైక్‌లు దొంగలిస్తున్నాడు. మరోవైపు గంజాయి వ్యాపారానికి తెరలేపాడు. దొంగతనం చేసిన బైకును కె.పెదబయలుకు చెందిన పంతులబాబు అనే వ్యక్తికి ఇచ్చి గంజాయి తీసుకుని బిక్కవోలుకు రాగా పోలీసులకు దొరికాడు.

Similar News

News April 17, 2025

రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

రేషన్ కార్డులకు సంబంధించి కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రేషన్ కార్డుల విచారణ, ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తులను వెంటనే విచారణ చేసి అర్హత మేరకు మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.

News April 17, 2025

SUPER.. గిన్నిస్ రికార్డ్ కొట్టిన మహబూబ్‌నగర్ అమ్మాయి 

image

మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన టి.సత్యం గౌడ్, పుష్పలత దంపతుల కుమార్తె టి.హన్సికకు ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన కూచిపూడి ప్రదర్శనలో కనబరిచిన ప్రతిభకు గాను, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా స్థానిక ఎంజే ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వారు విద్యార్థినిని శాలువాతో సత్కరించారు. ప్రతి విద్యార్థి చదువులోనే కాకుండా ప్రతి రంగంలో రాణించాలని, ఇలాంటి సత్కారాలు ఎన్నో అందుకోవాలని సూచించారు. 

News April 17, 2025

వనపర్తి: ‘అనుమతి ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను’ 

image

58 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు నెల రోజుల్లో అనుమతి ఇవ్వాలని లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటానని బీజేపీ వనపర్తి పట్టణ మాజీ అధ్యక్షుడు బచ్చు రాము హెచ్చరించారు. వనపర్తి మండలంలోని తిరుమలయ్య గుట్ట క్రాస్ రోడ్డు వద్ద 58 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటుకు ఐదు గుంటల భూమి ఇవ్వాలని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

error: Content is protected !!