News May 2, 2024

కాకినాడ: సర్పంచ్ హేమ కుమారికి అరుదైన అవకాశం 

image

ప.గో జిల్లా పేకేరు గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్నా హేమ కుమారి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. మే 3న అమెరికా ఐక్యరాజ్య సమితిలో నిర్వహిస్తున్న 57వ మకిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు. హేమ కుమారి 2022లో కాకినాడ జేఎన్‌టీయూ ఎంటెక్ పట్టా పొందారు. జేఎన్టీయూలో ఐదేళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్‎గా పనిచేశారు. 

Similar News

News November 24, 2024

గోకవరం: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి 

image

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన విషాదకర ఘటన గోకవరం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మి గోకవరం ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌లో పని చేస్తున్నారు. ప్రసవం నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా ఉమ్మనీరు రక్తనాళాల్లోకి వెళ్లి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను చూడకుండానే మృతి చెందడం కలిచివేసింది. 

News November 24, 2024

కాకినాడ: టీచర్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు

image

కాకినాడలోని ఓ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించేందుకు పాఠశాలకు వచ్చిన మహిళా పోలీసులకు తమ ఒంటిపై చేతులు వేసి టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు టీచర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఉపాధ్యాయుడిని పీఎస్‌కు తరలించారు.

News November 23, 2024

రాజవొమ్మంగి: 35 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఒకే పాఠశాల విద్యార్థులు

image

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో 35 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ కృష్ణారావు శనివారం మీడియాకు తెలిపారు. అరకులో జరిగిన జూడో, వెయిట్ లిఫ్టింగ్, యోగా, వాలీబాల్ క్రీడల్లో విజేతలుగా నిలిచారని చెప్పారు. విజేతలతోపాటు వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బందిని సైతం ప్రిన్సిపల్, టీచర్స్ అభినందించారు.