News September 4, 2024
కాకినాడ: సురక్షితంగా తీరానికి చేరిన మత్స్యకారులు

తుఫాను కారణంగా బంగాళాఖాతం సముద్రంలో చిక్కుకున్న చెన్నై ఫిషింగ్ బోట్‌తో పాటు అందులోని 10 మంది మత్స్యకారులను భారత తీర రక్షక దళం బుధవారం రక్షించింది. ఆగస్టు 23న బయలుదేరిన మత్స్యకారులు సాంకేతిక కారణంతో తుఫానులో చిక్కుకున్నారు. సముద్ర తీరం నుంచి 100 నాటికన్ మైళ్ల వద్ద గుర్తించారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు అధికారులు పంపిన టగ్ ద్వారా కాకినాడ కస్టమ్స్ జెట్టీకి సురక్షితంగా తీసుకువచ్చినట్లు తెలిపారు.
Similar News
News February 23, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై YS షర్మిల సీరియస్!

రాజమండ్రిలో కల్తీ పాల వల్ల నలుగురు మృతి చెందడంపై సోమవారం పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
News February 23, 2026
తూ.గో: 58 కేంద్రాలు @ 43,108 మంది విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 58 కేంద్రాల్లో 43,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా, అరగంట ముందు వెళ్లే నిబంధనను రద్దు చేశారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఏర్పాటు చేశారు.
News February 23, 2026
రాజమండ్రి: అనూరియా కేసులపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

తూ.గో. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రాజమండ్రిలో అనూరియా కేసుల క్లస్టర్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వరరావు వివరాలు ప్రకారం రాజమండ్రికి చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించి విచారణ ప్రారంభించామన్నారు.


