News April 5, 2024
కాకినాడ: 3 ఎన్నికలు.. 3 పార్టీలు గెలుపు

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో కాకినాడ రూరల్ ఏర్పాటైంది. కాగా ఈ నియోజకవర్గంలో తొలిసారి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురసాల కన్నబాబు PRP నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో పిల్లి అనంతలక్ష్మి TDP నుంచి, 2019లో కురసాల కన్నబాబు YCP నుంచి గెలుపొందారు. ఇలా జరిగిన 3 ఎన్నికల్లో 3 వేర్వేరు పార్టీలు గెలుపొందాయి. మరి ఈ సారి ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
Similar News
News March 31, 2025
రాజమండ్రి: విషమంగా అంజలి ఆరోగ్య పరిస్థితి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కిమ్స్‌లో వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో ఉన్న అంజలి (23) తాజా ఆరోగ్య బులిటెన్ విడుదలైంది. 7మంది వైద్యుల కమిటీ వైద్య పరీక్షలు చేసి ఈ ఆరోగ్య నివేదికను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఆమె ఎవరినీ గుర్తించలేని, స్పందించని స్థితిలో ఉందని వారు తెలిపారు. కళ్లకి వెలుతురు చూపినా రెస్పాన్స్ రావటం లేదన్నారు. మొత్తంగా ఆమె పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని వైద్యులు చెప్పారు.
News March 31, 2025
రాజమండ్రి: ముస్లిం సోదరులకు కలెక్టర్ శుభాకాంక్షలు

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..తోటి వారికి, పేద వారికి మనకు ఉన్న దాంట్లో సహాయం చేసే గొప్ప దాన గుణాన్ని చాటే పండుగ రంజాన్ అన్నారు. దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాస ఉపవాస దీక్షలు నియంత్రణా సాధ్యం చేసే గొప్ప సందేశం అని పేర్కొన్నారు.
News March 30, 2025
రాజమండ్రి: సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

మార్చి 31 రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు .