News February 26, 2025

కాకినాడ: 8 మంది ఓపీఓలు సస్పెండ్- కలెక్టర్

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు హాజరుకాని 8 మంది ఓపీఓలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కాకినాడ కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. కాకినాడ డివిజన్‌లో ముగ్గురు, పెద్దాపురం డివిజన్‌లో ఐదుగురు బుధవారం పోలింగ్ సామగ్రి తీసుకువెళ్లే కార్యక్రమానికి హాజరు కాలేదున్నారు. దీంతో వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు విధులకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

Similar News

News February 27, 2026

వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై నిర్లక్ష్యమెందుకు?: KTR

image

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల్లో జాప్యంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీశారు. 2021 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. రెండేళ్లలో 75 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశామని, ఇప్పుడు కావాలనే పనుల్లో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.

News February 27, 2026

సిద్దిపేట: ‘చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి’

image

సిద్దిపేట పట్టణంలోని కల్వకుంట కాలనీ అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను జిల్లా జడ్జి, లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి, వారికి ప్రాథమిక చట్టాలపై అవగాహన కల్పించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

News February 27, 2026

KK లైన్ కోల్పోయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్

image

APకి కీలకమైన కొత్తవలస-కిరండోల్ (KK లైన్) మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి రాయగడ డివిజన్‌లోకి వెళ్లింది. వాల్తేరు డివిజన్‌లో KK లైన్లోని అరకు, బొర్ర గుహాలు,ఐరన్ ఓర్,బొగ్గు వంటి భారీ కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం వచ్చేది. కొత్తవలస జంక్షన్‌తో పాటు VZM, SKLM జిల్లాల్లోని కీలక సెక్షన్లు రాయగడ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కు వెళ్లాయి. ఈ జోన్ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడనుంది.