News August 31, 2024
కాకినాడ GGHలో ఎంపాక్స్ ఐసోలేషన్ వార్డ్

కాకినాడ GGH ఆసుపత్రిలోని ENT విభాగంలో 24 పడకలతో ఎంపాక్స్ ఐసోలేషన్ ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో వైద్యారోగ్య అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. GGHలోని హెచ్‌వోడీలతో ప్రత్యేక నోడల్ బృందాన్ని సైతం ఏర్పాటుచేసినట్లు సూపరింటెండెంట్ డా.లావణ్య కుమారి తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి అనుమానిత కేసులేమీ లేవన్నారు.
Similar News
News August 23, 2025
కాకినాడ: స్వర్ణాంధ్రాపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

ఆగస్ట్ 23న జరగనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంపై కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విభాగాధిపతులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈసారి ‘పరిశుభ్రత’తో పాటు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.
News August 22, 2025
గుడ్డిగూడెంలో ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి

గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామం సమీపంలో కూలీలతో వెళ్లిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలం పనులు ముగించుకొని ఆరుగురు కూలీలు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
News August 22, 2025
కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడవ ప్రయాణాలు, చేపలు పట్టడం, ఈతకు దిగడం వంటివి పూర్తిగా నిషేధమని జిల్లా యంత్రాంగం తెలిపింది. సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని సూచించింది.