News February 14, 2026

కాగజ్‌నగర్‌లో ఓటర్ల విలక్షణ తీర్పు..!

image

కాగజ్‌నగర్ బల్దియా ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఇక్కడ పోటీ చేసిన 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కదానికి మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు ఇవ్వలేదు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 9, BRS 11, BJP 05, AI MIM 01, ఇండిపెండెంట్ లు 03 గెలిచారు.

Similar News

News February 15, 2026

ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

image

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జననం
1861: UK గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్‌హెడ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం
2022: మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లాహిరి మరణం (ఫొటోలో)

News February 15, 2026

చిరంజీవి సినిమాలో ‘ఛాంపియన్’ హీరోయిన్?

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో <<18950253>>మరో సినిమా<<>> తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో చిరు కనిపించనున్నారని చర్చ జరుగుతోంది. కీలకమైన కూతురు క్యారెక్టర్ కోసం ‘ఛాంపియన్’ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కృతి శెట్టి, సారా అర్జున్ పేర్లనూ పరిశీలించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

News February 15, 2026

మెదక్: 16న మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక

image

మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలను ఈనెల 16న పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉ.11 గంటలకు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మ.12:30 గంటలకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. సమావేశానికి కనీసం 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.