News March 2, 2025
కాగజ్‌నగర్‌లో ట్రైన్ ఢీకొని మహిళ మృతి

కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం నంబర్ 3పై గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే కానిస్టేబుల్ సురేశ్ ఆదివారం తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. మృతురాలి సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Similar News
News November 7, 2025
గచ్చిబౌలి: ఫుడ్ ప్రాసెసింగ్‌పై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్

గచ్చిబౌలి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై టెక్నికల్ యూనిట్ కాన్ఫరెన్స్ జరిగింది. చైనా, రష్యా సహా ఇతర దేశాలకు చెందిన పలువురు నిపుణులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై పెట్టుబడులు లాభసాటిగా ఉన్నాయని, రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నట్లుగా FPUD డైరెక్టర్ సింగనాద్ జూరీ తెలిపారు.
News November 7, 2025
వనపర్తి: ‘బీజీలు సమర్పించిన మిల్లులకే ధాన్యం కేటాయింపు’

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు (బీజీ) సమర్పించిన రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. అర్హత సాధించిన 80 మిల్లుల్లో కేవలం 18 మిల్లులు మాత్రమే బీజీలు సమర్పించాయని, మిగతా అర్హతగల మిల్లులన్నీ వెంటనే బీజీలు సమర్పించాలని ఆదేశించారు.
News November 7, 2025
చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.


