News February 5, 2025

కాగజ్‌నగర్‌లో దేశీదారు స్వాధీనం

image

కాగజ్‌నగర్‌లో బుధవారం దేశీదారు బాటిల్స్ పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. దేశీ దారు స్వాధీనం చేసుకొని రత్నం శ్రీకాంత్, వోగ్గు దివాకర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

Similar News

News December 21, 2025

VZM: జిల్లా వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం మొత్తం 1,171 పోలియో కేంద్రాలు, 20 ట్రాన్సిట్ టీమ్‌లు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 22, 23, 24వ తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.

News December 21, 2025

తూ.గో: మత్స్యకారుడి వలకు చిక్కిన డాల్ఫిన్

image

కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో మత్స్యకారులకు 200 కేజీల డాల్ఫిన్ వలకు చిక్కింది. సుమారుగా 300 మీటర్ల దూరంలోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటుందని మత్య్సకారులు చెబుతున్నారు. ఎంతోమంది ఆంగ్ల భాషలో డాల్ఫిన్ అని పిలిచే ఈ చేపను తెలుగులో గొడ్డం చేప అని అంటారని మత్స్య కారులు తెలిపారు. డాల్ఫిన్ తినడానికి పనిచేయదన్నారు. ఈ చేపను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. అనంతరం డాల్ఫిన్‌ను సురక్షితంగా సముద్రంలోకి విడిపెట్టారు.

News December 21, 2025

హైదరాబాద్‌లో DANGER ☠️

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ శనివారం 255కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT