News July 7, 2024

కాగజ్‌నగర్‌లో పెద్దపులి సంచారం

image

కాగజ్‌నగర్ అటవీ రేంజ్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు FRO రమాదేవి తెలిపారు. పట్టణ సమీప గ్రామాలైన అంకుసాపూర్, నందిగూడ, నార్లపూర్, గొంది, చారిగాం, కోసిని, రేగులగూడ, ఊట్పల్లి, వేంపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. పులి కదలికలు, పాదముద్రలు వంటివి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News February 16, 2026

ADB: 25ఏళ్ల తర్వాత రెండో సారి

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో స్వతంత్ర అభ్యర్థిగా గొడుగు గుర్తుపై లాలా రాధేశ్యాం పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కుక్కర్ గుర్తుపై గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి అనూష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

News February 16, 2026

ఆదిలాబాద్‌ బల్దియాలో అరుదైన దృశ్యం

image

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో పక్కపక్క వార్డుల అభ్యర్థులే అత్యున్నత పదవులను కైవసం చేసుకోవడం విశేషం. చైర్‌పర్సన్‌గా 45వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష, వైస్ చైర్మన్‌గా 44వ వార్డు సభ్యుడు మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. వరుస సంఖ్య గల వార్డులకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 16, 2026

ఆదిలాబాద్‌ బల్దియాలో బీజేపీకి భంగపాటు

image

ఆదిలాబాద్‌‌లో కమలదళానికి గట్టి షాక్ తగిలింది. 21మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైంది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు, చివరి నిమిషంలో వారు హ్యాండ్ ఇవ్వడంతో పీఠం చేజారిపోయింది. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు తలకిందులయ్యాయి.