News April 1, 2025

కాగజ్‌నగర్: ఈనెల 3న నర్సరీ పండ్ల తోటల వేలం

image

కాగజ్‌నగర్ మండలంలోని జంబుగా ఉద్యాన నర్సరీ మామిడిపండ్ల తోటలను ఈనెల 3న వేలం వేస్తున్నట్లు ఐటీడీఏ పీవో కుష్బూగుప్త ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాటలో (2025- 26- 27) మూడు సంవత్సరాలకు కలిపి వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తోటలో బంగన్పల్లి, దశేరి తోతపల్లి, రసాలు వంటి హైబ్రిడ్ రకాలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 11 గంటలకు వేలంపాటలో పాల్గొనాల్సిందిగా కోరారు.

Similar News

News April 2, 2025

ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 45,548 మంది ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో ప్రత్యేక సబ్సిడీ డబ్బులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం మొత్తం ₹72crను విడుదల చేశామన్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం ఎకరాకు ₹50వేలకు పైగా అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.34 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతోంది. 2023లో మార్చిలో టన్ను గెల ధర ₹14,174గా ఉండగా, ప్రస్తుతం ₹21,000కు చేరిందని మంత్రి తెలిపారు.

News April 2, 2025

ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపు

image

TG: ఎల్ఆర్ఎస్ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

News April 2, 2025

సోంపేట: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మ‌ృతి

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగనట్లు ఆయన చెప్పారు. ఆమె వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. వివరాలు తెలిస్తే ఈ నంబర్‌ను 9989136143 సంప్రదించాలని ఆయన చెప్పారు.

error: Content is protected !!