News February 3, 2025
కాగజ్‌నగర్: చదువుల తల్లి వేషధారణలో చిన్నారి

వసంత పంచమి సందర్భంగా పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఓ చిన్నారి సరస్వతి మాత వేషధారణలో వచ్చి ఆకట్టుకుంది. చిన్నారిని చేతిలో వీణ, అమ్మవారి వస్త్రధారణలో కిరీటంతో బాల సరస్వతి మాతగా అందంగా అలంకరించారు. అనంతరం వేద పండితులు మాట్లాడుతూ.. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే చిన్నారుల మేధోశక్తి పెంపొంది విద్యపై మక్కువ పెరుగుతుందన్నారు.
Similar News
News April 15, 2026
నాతవరం జీడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

నాతవరం మండలం గన్నవరం గ్రామ పరిసర జీడి తోటలో గుర్తుతెలియని వ్యక్తి (40) మృతిచెందాడు. సమాచారం అందుకున్న SI వై.తారకేశ్వరరావు మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు 4-5 రోజుల క్రితమే మరణించినట్లు అంచనా వేస్తున్నారు. మృతుడు నలుపు షార్ట్, చెక్స్ షర్ట్, క్రాక్స్ చెప్పులు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని SI కోరారు.
News April 15, 2026
హార్ముజ్ బ్లాక్.. ఇరాన్‌కు ఎంత నష్టమంటే?

పశ్చిమాసియాకు అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని <<19639152>>యుద్ధ నౌకలతో<<>> అమెరికా బ్లాక్ చేయడం తెలిసిందే. ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై ఆంక్షలు పెట్టింది. దీంతో ఇరాన్‌కు రోజూ 435 మిలియన్ డాలర్ల(రూ.4 వేల కోట్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. దిగ్బంధనం లేని ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన 154 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉందని Kpler తెలిపింది. ఆ క్రూడ్‌ను ఎగుమతి చేసేందుకు ఛాన్స్ ఉంది.
News April 15, 2026
తిరుచానూరులో మిథాలి రాజ్ పూజలు

మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేశ్, ఏవిఎస్వో రాధాకృష్ణ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మిథాలి రాజ్‌కు అర్చకులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయాధికారులు ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


