News July 1, 2024
కాగజ్‌నగర్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

వెనుకబడిన ప్రాంతాలకు విద్య, వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏది నెరవేర్చలేదని ప్రజలు గుర్తించాలన్నారు.
Similar News
News February 12, 2026
ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.
News February 11, 2026
బోథ్ అడవుల్లో పులుల సంచారం

బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. పుణ్య నాయక్ తండాలో పవర్ సక్రుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపింది. అటవీ అధికారులు ప్రశాంత్ పాటిల్, విశ్వనాధ్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, విద్యుత్ కంచెలు వేయవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News February 10, 2026
ADB: ఈ నెల 20 వరకు పత్తి కొనుగోళ్లు

సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న పత్తి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. రైతులు పత్తి అమ్మెందుకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులకు వీలులేదన్నారు. పత్తి నిల్వ ఉన్న రైతులు తప్పకుండా త్వరగా సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.


