News March 22, 2025
కాగజ్‌నగర్: 3 ఇళ్లల్లో చోరీ.. నిందితుడు అరెస్ట్

3 ఇళ్లలో చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణంలోని బాలాజీ నగర్‌లో కొద్ది రోజుల క్రితం 3 ఇళ్లలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా ప్రదీప్ అనే నిందితుడుని పట్టుకున్నామన్నారు. అతడి వద్ద 86.6 గ్రా. బంగారు ఆభరణాలు, కారు, సెల్ ఫోన్, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News October 31, 2025
బాసర: ఆర్జీయూకేటీ కాలేజీలో ఇంగ్లిష్ భాషపై ప్రత్యేక శిక్షణ

బాసర ఆర్జీయూకేటీలో ఇంగ్లిష్ విద్యా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు 2 రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్జీయూకేటీ ఎంపికైన ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లభాషా నైపుణ్యాలను పెంపొందించడం కోసం శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్ అన్నారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన విద్యార్థులు ఆంగ్ల భాష అంటే భయపడకూడదని, ప్రతిరోజు కొద్దిగా సాధన చేయాలన్నారు.
News October 31, 2025
జగిత్యాల: ‘రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి’

రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని మోరపెల్లి గ్రామంలో గల ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హరిణి, జగిత్యాల రూరల్ తహశీల్దార్ వరందన్, గిర్దావర్ భూమయ్య, జీపీవో మహేశ్ పాల్గొన్నారు.
News October 31, 2025
సిరిసిల్ల: ‘మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలి’

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని ఇన్చార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో DEO, GCDO, BC, SC, ST, మైనారిటీ EMRS, గురుకులాల DCO, ప్రిన్సిపళ్లతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని విద్యాలయాల్లో డైనింగ్ హాల్లో మెనుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాల వివరాలను రిజిస్టర్ చేయాలన్నారు.


