News February 9, 2025

కాగజ్ నగర్: ఈనెల 21 వరకు పలు రైళ్లు రద్దు

image

సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ మార్గంలో నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్యాసింజర్ రైళ్లను ఈనెల 10 నుంచి 21 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమర్షియల్ ఛీప్ అధికారి కైలాస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ – సికింద్రాబాద్ రూట్లో గుంటూరు వరకు నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైల్ లింకుతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 14, 2025

లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్‌గా నీలం చంద్రారెడ్డి గెలుపు

image

తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం చంద్రారెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి కరివేద శ్యాంసుందర్ రెడ్డిపై 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప మెజార్టీతో గెలుపొందిన చంద్రారెడ్డికి గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారు గెలుపొందడంతో లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

News December 14, 2025

హెయిర్ డై మచ్చలు పోవట్లేదా?

image

అందంగా కనిపించాలనో, తెల్లవెంట్రుకలు దాయాలనో చాలామంది హెయిర్ డైలు వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు వీటి మచ్చలు నుదురు, మెడ దగ్గర అంటి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు బేబీ ఆయిల్‌, ఎసెన్షియల్ ఆయిల్స్‌ను మచ్చలపై అప్లై చేసి కాసేపు రుద్ది కడిగేస్తే సరిపోతుంది. వెనిగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో రుద్దినా మచ్చలు తగ్గుతాయి. నిమ్మరసంలో కాస్త కొబ్బరినూనె కలిపి రాసినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News December 14, 2025

MP-IDSAలో ఉద్యోగాలు

image

మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసిస్(MP-IDSA)లో 9 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రీసెర్చ్ ఫెల్లో, అసోసియేట్ ఫెల్లో, రీసెర్చ్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.idsa.in