News April 15, 2024
కాగజ్ నగర్: బిల్లులు ఇవ్వడం లేదని స్కూలుకు తాళం

కాగజ్నగర్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు నూతన బిల్డింగ్ నిర్మించి ఎనిమిది నెలలైనా బిల్లు ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆగ్రహంతో భవనం నిర్మించిన కాంట్రాక్టర్ తాళం వేశారు. ఈ పాఠశాలలో సుమారు 252 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈరోజు నుంచి ఫైనల్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు స్కూల్ ముందే కూర్చున్నారు. దీంతో ఉన్నతాధికారులు మూడు రోజుల గడువు కాంట్రాక్టర్‌కు ఇవ్వడంతో తాళం తీశారు.
Similar News
News April 22, 2025
ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్‌లో 68వ ర్యాంకు

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్‌రావు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News April 22, 2025
ప్రతి వాహనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ADB SP

ప్రతి వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారుల వాహనాల డ్రైవర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సూచనలు చేశారు. ప్రతి వాహనంలో కెమెరాలు చేశామన్నారు. వాటిని సరైన విధంగా పద్ధతిలో ఉంచుకోవాలని తెలియజేశారు.
News April 22, 2025
ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆమీనా షిరీన్

ఆర్టీసీ కార్మికుడి కూతురు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. ADB RTCలో రీజినల్ ఆన్లైన్ రిజర్వేషన్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహమ్మద్ హుస్సేన్ కూతురు ఆమీనా షిరీన్ సెకండియర్‌లో 99శాతం ఉత్తీర్ణత సాధించింది. బైపీసీ విభాగంలో 1000కి 990 మార్కులు సాధించింది. ఆమెకు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు. మన ADB అమ్మాయికి CONGRATULATIONS చెప్పేయండి మరి.