News March 31, 2024
కాగజ్ నగర్: రైలు కిందపడి ఝార్ఖండ్ వాసి మృతి

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ కథనం ప్రకారం.. బిలాస్పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రైలులో ఝార్ఖండ్ రాష్ట్రం గర్వ జిల్లా తెనర్కు చెందిన దిలీప్ కుమార్ సింగ్ ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News February 22, 2026
ఆదిలాబాద్ ‘బడా’ నేతలకు తప్పని భంగపాటు

ADB మున్సిపల్ ఎన్నికల్లో ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ నానుడి ప్రధాన పార్టీల నేతల విషయంలో తలకిందులైంది. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోయారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బీజేపీ నేత సుహాసిని రెడ్డి తమ సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
News February 22, 2026
ఆదిలాబాద్ : రేపు యథాతథంగా ‘ప్రజావాణి’

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. సమాచార సహాయక కేంద్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను నమోదు చేసి, సత్వర పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.