News April 10, 2025
కాచిగూడ నుంచే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ఈనెల 15 నుంచి మే 10 వరకు కాచిగూడ స్టేషన్ నుంచి నడుపుతున్నట్లు SCR అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7:55 గంటలకు కాచిగూడలో బయలుదేరి.. కర్నూలుకు మధ్యాహ్నం 12:30కు చేరుకుంటుందన్నారు.
Similar News
News September 19, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు ఈనెల 24 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News September 19, 2025
అంతర్గత, బాహ్య పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్‌లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.
News September 19, 2025
ఈ నెల 22 నుంచి దసరా సెలవులు: లోకేశ్

AP: దసరా సెలవులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉన్నాయి. తాజాగా మార్చడంతో అదనంగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.