News July 7, 2025

కాచిగూడ- యశ్వంత్‌పుర వందేభారత్ కోచ్‌ల సంఖ్య పెంపు

image

కాచిగూడ- యశ్వంత్‌పర వందే భారత్ కోచుల సంఖ్యను రైల్వే శాఖ పెంచింది. ప్రస్తుతం 8 కోచ్‌లు 530 సీటింగ్ కెపాసిటీతో నడుస్తున్న ఈ ట్రైన్ జూలై 10 నుంచి 16 కోచ్‌లు 1,128 సీటింగ్‌ కెపాసిటీతో పరుగులు పెట్టబోతోంది. ప్రస్తుతం 7 చైర్‌కార్, 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో నడుస్తుండగా ఇకపై 14 చైర్‌కార్, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

Similar News

News February 18, 2026

FSLలో కొలువులు.. NOTIFICATION వచ్చేసింది..!

image

TG ఫోరెన్సిక్ ల్యాబ్(FSL) ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గమనిక. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న వారిలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాతపరీక్షలకు ఎంపిక చేశారు. MAR 5,6,7 తేదీల్లో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పరీక్షలు జరగనున్నాయి. షార్ట్ లిస్ట్ కానివారు రూ.500 ఫీజు చెల్లించి FEB 21వ తేదీ ఉదయం 8గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలు తెలపవచ్చు. హాల్ టికెట్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

News February 18, 2026

‘భాగ్య’నగరంలో ఉద్యమించిన ధ్రువతార

image

అంబేడ్కర్‌ సన్నిహితుడు మన హైదరాబాదీ మాదరి భాగయ్య. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. కుల వివక్షను ప్రశ్నిస్తూ, సమాజంలో గౌరవ సూచకంగా భావించిన ‘రెడ్డి’, ‘వర్మ’లను తన పేరులో చేర్చుకుని భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందారు. దేవదాసీ వ్యవస్థ, నిజాం పాలనలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆది హిందూ చైతన్యానికి బలమైన పునాదులు వేశారు. దళిత హక్కుల కోసం పోరాడి చరిత్రకెక్కారు.
#నేడు ఆయన వర్ధంతి.