News February 26, 2026
కాజీపేటలో కల్తీ ఐస్ క్రీం స్వాధీనం

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురిలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీంలతో పాటు గడువు తీరిన రూ.60,400 విలువలైన 12 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
Similar News
News February 26, 2026
NLG: ఇంటర్ పరీక్షలు.. రెండో రోజు 286 మంది డుమ్మా..!

జిల్లాలో రెండో రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 286 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,480 మంది విద్యార్థులకు గాను 11,265 మంది హాజరుకాగా, 215 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,637 మంది విద్యార్థులకు గాను 1,566 మంది హాజరుకాగా, 71 మంది గైర్హాజరయ్యారు.
News February 26, 2026
బాపట్ల: 40 బైకులు, 4 లీటర్ల నాటుసారా స్వాధీనం- ఎస్పీ

జిల్లాలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించి 40 బైకులు, 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. బాపట్ల డీఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.
News February 26, 2026
డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ‘అతివేగం, డ్రంకెన్ డ్రైవ్ వంటి కారణాలతో ఏటా 1.8L మంది చనిపోతున్నారు. అందుకే త్వరలో కొత్త విధానం తెస్తాం. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పాయింట్ల కోత పడుతుంది. అన్ని పాయింట్లు కోల్పోతే లైసెన్స్‌ను 6నెలలు సస్పెండ్ చేస్తాం. రిపీట్ చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం’ అని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.


