News December 12, 2025

కాజీపేటలో 103 చలాన్లు ఉన్న బైక్ సీజ్

image

కాజీపేట ట్రాఫిక్ పోలీసులు చర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 103 పెండింగ్ చలాన్లు ఉన్న ఒక బైక్‌ను గుర్తించారు. ఆ వాహనంపై మొత్తం ₹25,105 బకాయిలు ఉండటంతో, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న ఆదేశాల మేరకు ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు కనక చంద్రం, సంపత్ పాల్గొన్నారు.

Similar News

News December 18, 2025

సింహాచలం దేవస్థానంలో పది రోజులు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 20 నుంచి 29 వరకు పగల్ పత్తు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.సుజాత గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ తిరువీధి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల కారణంగా ఈ పది రోజుల పాటు నిత్యం జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు.

News December 18, 2025

పార్డి (బి)లో రికార్డు.. సర్పంచ్‌గా 22 ఏళ్ల యువకుడు

image

కుబీర్ మండలం పార్డి-బి చరిత్రలోనే పిన్న వయస్కుడైన ప్రవీణ్ సర్పంచ్‌గా రికార్డు సృష్టించారు. పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి జరిగిన 15 ఎన్నికల్లో మొదటిసారిగా 22ఏళ్ల ప్రవీణ్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 35 ఏళ్లు పైబడిన వారే సర్పంచులుగా ఎన్నికవ్వగా తొలిసారి చిన్నవయస్సులో సర్పంచ్ అయి రికార్డు నెలకొల్పారు. ఈ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి రాజేశ్వర్‌పై 371 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

News December 18, 2025

రోల్ బాల్ WC విజేతలుగా భారత జట్లు

image

దుబాయ్ వేదికగా జరిగిన రోల్ బాల్ వరల్డ్ కప్‌లో భారత మెన్స్, ఉమెన్స్ టీమ్స్ అదరగొట్టి ఛాంపియన్లుగా నిలిచాయి. కెన్యా జట్లతో జరిగిన ఫైనల్‌లో మహిళల జట్టు 3-2 తేడాతో, పురుషుల జట్టు 11-10 తేడాతో విజయం సాధించాయి. కాగా ఇది రోలర్ స్కేట్స్‌తో ఆడే ఒక గేమ్. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, త్రోబాల్ కలయికలో ఉంటుంది. ఆటగాళ్లు స్కేట్స్ వేసుకొని బంతిని చేతులతో పాస్ చేసుకుంటూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి వేయాలి.