News September 7, 2025

కాజీపేటలో 32 అడుగుల మట్టి గణపతి నిమజ్జనం

image

కాజీపేట డీజీల్ కాలనీలో శనివారం 32 అడుగుల మట్టి గణపతిని స్థాపించిన చోటనే నిమజ్జనం చేశారు. శ్రీసాయి యూత్ ఆధ్వర్యంలో 32 అడుగుల మట్టి గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. వేలం పాటలో రూ.38,016కు నరసింగ రావు అనే భక్తుడు లడ్డూను దక్కించుకున్నాడు. ఫైర్ ఇంజిన్ సహాయంతో గణేశ్ నిమజ్జనం పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News September 8, 2025

మాతా, శిశు వైద్యసేవలు విస్తరిస్తున్నాం: మంత్రి సత్యకుమార్

image

AP: ప్రభుత్వాస్పత్రుల్లో మాతా, శిశు వైద్య సేవలను విస్తరిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గుంటూరు, కాకినాడ GGHలలో 500 చొప్పున పడకలతో 2 బ్లాకులు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆయా చోట్ల రూ.51కోట్లతో వైద్య పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కొత్త బ్లాకుల కోసం ICU బెడ్లు, పేషెంట్ మానిట‌ర్లు, వెంటిలేట‌ర్లు, మొబైల్ అల్ట్రా సౌండ్ మెషీన్లు తదితరాలు భారీ స్థాయిలో కొనుగోలు చేయ‌నున్నారు.

News September 8, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా: 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెడీ
☞ మచిలీపట్నం: పర్యాటకుల జేబులకు చిల్లు.!
☞ మోపిదేవిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
☞ గుడివాడ- కంకిపాడు రోడ్‌లో గుంతలో పడి వ్యక్తి మృతి
☞ మొవ్వలో రూ.1.70 లక్షల విలువైన యూరియా సీజ్
☞పోరంకిలో విజయవాడ ఉత్సవ్ సన్నాహక కార్యక్రమం
☞ జూపూడిలో మందు గుండు సామాగ్రి కలకలం
☞ అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యేకి వైసీపీలో కీలక పదవి

News September 8, 2025

భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త

image

చిలమత్తూరులో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. మద్యం మత్తులో భార్య లక్ష్మిదేవి(35)తో వాగ్వాదానికి దిగిన రాఘవేంద్ర కోపోద్రిక్తుడై గొడ్డలితో నరికి హతమార్చాడు. రక్తమోడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దంపతులకు ఇంటర్ చదువుతున్న ఒక కుమార్తె ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.