News January 29, 2025
కాజీపేట- అజ్నీ బండి నడిపండి సారూ!

కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటంలేదు. దీంతో కాజీపేట్-బల్లార్షా సెక్షన్‌ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్యాసింజర్ సేవల్ని ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సర్వీస్ పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Similar News
News September 19, 2025
జగిత్యాల: పోషణ్ పక్వాడ్ కార్యక్రమంపై శిక్షణ

జగిత్యాల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల సీడీపీఓ మమత గురువారం పట్టణ అంగన్‌వాడీ టీచర్లకు ‘పోషణ్ బి పడ్డా బాయ్’ కార్యక్రమంపై అవగాహన శిక్షణ ఇచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో భాగంగా తొలిరోజు ప్రీ-స్కూల్ మెటీరియల్ తయారీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కవితారాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
News September 19, 2025
సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులు ర్యాంకులు సాధించాలి: కలెక్టర్

జిల్లాలోని ఇంటర్ విద్యార్థులు అత్యధికంగా జేఈఈ, నీట్‌లలో ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్‌తో గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్ తర్వాత చదివే కోర్సుల ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News September 19, 2025
SMలో ప్రభాస్ Vs దీపిక ఫ్యాన్స్ వార్

ప్రభాస్ ‘కల్కి-2’లో <<17748690>>దీపికను<<>> పక్కనపెట్టడంతో ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ మధ్య SMలో వార్ జరుగుతోంది. దీపిక గొంతెమ్మ కోరికలు కోరతారని, పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. అందుకే వర్క్‌పై ‘ఎక్కువ కమిట్‌మెంట్’ లేదనే కారణంతో పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే కల్కి-1 సమయంలో ప్రెగ్నెంట్ అయినా దీపిక నటించారని, అంతకంటే ఇంకేం కమిట్‌మెంట్ కావాలని ఆమె మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై మీ కామెంట్?