News January 29, 2025
కాజీపేట- అజ్నీ బండి నడిపియండి సారూ!

కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటంలేదు. దీంతో కాజీపేట్-బల్హర్షా సెక్షన్‌ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్యాసింజర్ సేవల్ని ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సర్వీస్ పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.
Similar News
News July 6, 2025
HYD: తక్కువ ఖర్చుతో పార్సిల్.. సెంటర్లు ఇవే..!

తక్కువ ఖర్చుతో ఇతర ప్రాంతాలకు RTC కార్గో సెంటర్ల ద్వారా పార్సిల్ చేయొచ్చని అధికారులు తెలిపారు. HYD రీజియన్ పరిధి నాగోల్ క్రాస్ రోడ్డు, ఓయూ క్యాంపస్, పనామా గోడౌన్, సంతోష్ నగర్, ఆరాంఘర్, గుడిమల్కాపూర్, బోలకపూర్, నాంపల్లి, టెలిఫోన్ భవన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు బస్ భవన్, నారాయణగూడ, సంతోష్ నగర్, చింతలకుంట, పెద్దఅంబర్పేట, మునగనూరు క్రాస్ రోడ్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. బరువు ప్రకారం ఛార్జీ ఉంటుంది.
News July 6, 2025
పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PSలో ఫిర్యాదు చేసింది.
News July 6, 2025
NLG: రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ

KGBVలో ప్రత్యేక అధికారులు, PGCRTలు, CRTలు, పీఈటీలు, ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులతో పాటు అదేవిధంగా టీజీ MSGHలో ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఈ నెల 7వ తేదీ వరకు ఫిర్యాదులు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. 1:1 నిష్పత్తిలో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందు పరిచామని తెలిపారు.