News January 29, 2025

కాజీపేట- అజ్నీ బండి నడిపియండి సారూ!

image

కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటంలేదు. దీంతో కాజీపేట్-బల్హర్షా సెక్షన్‌ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్యాసెంజర్ సేవల్ని ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సర్వీస్ పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Similar News

News November 8, 2025

మహిళలు వేధింపులపై మౌనంగా ఉండొద్దు: ఎస్పీ నరసింహ

image

మహిళలు, బాలికలు లైంగిక వేధింపులను ధైర్యంగా బయటకువచ్చి చెప్పాలని ఎస్పీ నరసింహ సూచించారు. పనిచేసే చోట, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో మహిళలు, బాలికలు ఆపద సమయాల్లో హెల్‌లైన్‌ నంబర్లు సంప్రదించాలని ఎస్పీ అన్నారు. ‘వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్‌ పనిచేస్తాయని’ ఎస్పీ మహిళలకు సూచించారు.

News November 8, 2025

జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్‌పై అవగాహనా కార్యక్రమాలు

image

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాలతో జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో శక్తి యాప్‌పై పోలీసులు శనివారం అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు, విద్యార్థులు శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలన్నారు. ఆపద సమయంలో డయల్ 100, 112, 1091, 1098, 181, 1930కు ఫోన్ చేస్తే 5 నిమిషాలలో పోలీసులు మీ ముందు ఉంటారన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.

News November 8, 2025

మోతె: భార్యని హత్య చేసిన భర్త అరెస్ట్

image

మద్యం మత్తులో తాగడానికి డబ్బులు కోసం కర్రతో కిరాతకంగా భార్యని చంపిన భర్తను మోతె పోలీసులు అరెస్ట్ చేశారు. మోతె పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణారెడ్డి వివరాలు తెలిపారు. విభాలాపురం గ్రామానికి చెందిన బందేల్లి భార్య కరీంబీని తాగేందుకు డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో కర్రతో దాడి చేయగా చనిపోయింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు.