News July 10, 2025

కాజీపేట ఆర్వోబీని త్వరగా పూర్తి చేయాలి: HNK కలెక్టర్

image

కాజీపేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె కాజీపేట ఫాతిమా నగర్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తైన నిర్మాణ పనులు, పూర్తి కావాల్సిన పనులకు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసి ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News July 11, 2025

జఫర్‌గఢ్ కోటలో ఫిరంగుల కథ ఏంటో తెలుసా?

image

జనగామ జిల్లా జఫర్‌గఢ్ కోటలో ఫిరంగులు లోహపు మిశ్రమంతో తయారయ్యాయి. ఇవి శత్రువులపై దాడికి, కోట రక్షణ కోసం ఉపయోగించేవారు. కొంతమంది చారిత్రక పరిశోధకులు ఈ ఫిరంగులను మొఘల్ సామ్రాజ్యానికి చెందిన మిలిటరీ ఇంజినీర్లు తయారు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. కొన్నింటిపై అరబిక్ లిపి కనిపిస్తుంది. దీనిని చూసి ఇవి ముస్లిం పాలకుల కాలానికి చెందినవని అంచనా వేస్తారు. ఈ కోటకు మీరు వెళ్లారా? కామెంట్ చేయండి.

News July 11, 2025

మేడ్చల్: ‘రేషన్ కార్డులకు ఈ కెవైసీ పూర్తి చేయాలి’

image

మేడ్చల్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం E-KYC పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 5,37,810 కార్డుల్లోని 18,65,353 మంది లబ్ధిదారులకుగానూ 13,19,111 (70.72%) లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగిలిన 5,46,242 (29.28%) లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు.

News July 11, 2025

కానిస్టేబుల్ వైష్ణవి సేవలను అభినందించిన CP

image

రాచకొండ కమిషనర్ సుదీర్‌బాబు తలపెట్టిన విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సైబర్ అవగాహన కల్పిస్తున్న ఎల్బీనగర్ కానిస్టేబుల్ వైష్ణవిని ప్రశంసించారు. ప్రజలకు సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను గుర్తించి, తన క్యాంప్ కార్యాలయంలో రివార్డు అందజేశారు. బీటెక్ చేసిన వైష్ణవి 2024 బ్యాచ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు.