News April 3, 2025
కాజీపేట: టాస్క్ ఫోర్స్‌కు చిక్కిన జూదరులు

కాజీపేటలోని 100 ఫీట్ల రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.27,950 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు కాజీపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాబులాల్ తెలిపారు.
Similar News
News November 9, 2025
శ్రీరాంపూర్: ‘ఉత్పత్తి లక్ష్యసాధనకు సమిష్టిగా పనిచేయాలి’

నవంబర్ మాసంలో నిర్దేశిత 72 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధనకు రోజుకు 2.40 లక్షల టన్నులు బొగ్గు, ఉత్పత్తి రవాణా సాధించాలని సింగరేణి సంస్థ సీఅండ్ఎండీ ఎన్. బలరామ్ పిలుపునిచ్చారు. గురువారం సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్లు, కార్పొరేట్ విభాగాలు, అన్ని ఏరియాల జీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు.
News November 9, 2025
HEADLINES

* నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన PM మోదీ
* పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు
* ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తాం: పవన్
* కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్
* రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేసినా భయపడను: కిషన్ రెడ్డి
* వర్షం కారణంగా IND Vs AUS చివరి టీ20 రద్దు.. 2-1తో సిరీస్ భారత్ వశం
* స్థిరంగా బంగారం, వెండి ధరలు
News November 9, 2025
మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్‌ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.


