News October 24, 2024
కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా అప్ గ్రేడ్ చేయాలి: ఎంపీ కావ్య
దక్షిణ మధ్య రైల్వేకు ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా అప్ గ్రేడ్ చేయాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ నిర్వహించిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని కోరారు.
Similar News
News November 24, 2024
సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో కార్తీక మాసం ఆదివారం సందర్భంగా సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను చేపట్టారు. పూజా కార్యక్రమాలు అనంతరం సిద్దేశ్వరుడిని భక్తుల దర్శించుకుని తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు అర్చకులు తెలిపారు.
News November 24, 2024
SUNDAY SPECIAL.. ఆకట్టుకుంటున్న వరంగల్ రీజినల్ లైబ్రరీ
వరంగల్‌లో రీజినల్ లైబ్రరీ నగరవాసులను ఆకట్టుకుంటోంది. గత ప్రభుత్వంలో ఈ లైబ్రరీని ఆధునికీకరించారు. ఫర్నిచర్, ఇంటర్నెట్, వైఫైతో పాటు.. దాదాపు బుక్స్ అన్నింటినీ డిజిటలైజేషన్ చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అంతేకాదు, రోడ్డుపై వెళ్తుంటే లైబ్రరీ గోడపై రంగులతో దిద్దిన ఓ బాలిక చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఈ లైబ్రరీని చూసి ఉంటే కామెంట్ చేయండి.
News November 24, 2024
విజయోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క లేఖలు
ఈనెల 26న గ్రామ పంచాయతీలో జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో పార్టీలకతీతంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు పాల్గొనాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క లేఖలు రాశారు. నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా 95 గ్రామీణ నియోజకవర్గాల్లో రూ.2750 కోట్ల నిధులతో గ్రామ పంచాయతీల్లో ఇందిరా శక్తి మహిళా ఉపాధి భరోసాతో వివిధ అభివృద్ధి పనులు చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.