News January 31, 2025

కాజీపేట రైల్వే స్టేషన్.. 40 శాతం పనులు పూర్తి..!

image

కాజీపేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్స్ పథకంలో భాగంగా రూ.24.45 కోట్లతో జరుగుతున్న నిర్మాణపు పనుల్లో, ఇంటీరియర్ పనులు కొలిక్కి వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు మొత్తం పునరాభివృద్ధి పనులు 40 శాతం పూర్తయినట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Similar News

News October 29, 2025

పుట్టపర్తిలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

image

అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. కొత్తచెరువు పూజారి వీధిలో దొంగలు ఉన్నారనే సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10.5 తులాల బంగారం, 1250 గ్రాముల వెండి, 4 ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వడిషన వేణుగోపాల్ రెడ్డి, చిన్నం ఆదెమ్మలపై రాష్ట్రంలోని పలుచోట్ల చోరీ కేసులు నమోదయ్యాయని డీఎస్పీ వివరించారు.

News October 29, 2025

గాజాపై దాడులు.. 60 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

News October 29, 2025

కాకినాడ జిల్లాకు రక్షణ కవచంలా ‘ఆ ముగ్గురు’

image

మొంథా తుఫాను నుంచి కాకినాడ జిల్లాను రక్షించడంలో కలెక్టర్ షామ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ పోషించారు. తుఫాను ప్రభావం మొదలైనప్పటి నుంచి జిల్లా యంత్రాంగాన్ని వీరు ఉరుకులు పరుగులు పెట్టించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఫలితంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నియంత్రించగలగడంలో ఈ ముగ్గురూ సఫలీకృతలయ్యారు. వీరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.