News April 22, 2025
కాట్రేనికోన: క్యాథలిక్ గురువు ఫ్రాన్సిస్‌కు చిత్ర నీరాజనం

క్యాథలిక్కుల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తన యావత్తు జీవితాన్ని ప్రభువు సేవకై అంకితం చేశారు. సువార్త విలువలతో జీవించాలని ప్రబోధనలు చేస్తూ..ఏసుక్రీస్తుకు నిజమైన శిష్యుడిలా జీవించిన పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖ సాగరంలో ముంచి ప్రభువు వద్దకు చేరుకున్నారు. కాట్రేనికోనకు ప్రముఖ చిత్రకారుడు అంజి ఆకొండి ఫ్రాన్సిస్ చిత్రాన్ని అద్భుతంగా మలిచి అతని మృతికి చిత్ర నీరాజనం అర్పించారు.
Similar News
News April 22, 2025
త్వరలో 18 APPSC నోటిఫికేషన్లు: ప్రభుత్వం

AP: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 18 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు APPSC రెడీగా ఉన్నట్లు వివరించింది. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఉంటాయంది. ఈ 18 నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
News April 22, 2025
అనకాపల్లి: ‘ఆధునిక సాంకేతికతను వినియోగించాలి’

నేరాలు నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. రేంజ్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ సమీక్షలో అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా పాల్గొన్నారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ప్రజలు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
News April 22, 2025
BHPL: కారుణ్య నియామక పత్రాలను అందజేసిన కలెక్టర్

విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ కారుణ్య నియామక పత్రాలను అందచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి మీరు ప్రభుత్వంలో భాగస్వాములని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. సేవల్లో ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.