News October 11, 2025

కాట్రేనికోన: పెళ్లి ఇంట విషాదం

image

కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో శనివారం పెళ్లి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అన్న కుమారుడి వివాహం సందర్భంగా మల్లాడి భాగ్యరాజ్ మోటార్‌సైకిల్‌పై పెళ్లి కుమార్తె ఇంటికి (అయినాపురం) బయలుదేరాడు. నీళ్లరేవు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి అతన్ని ఢీకొట్టింది. ఘటనలో భాగ్యరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 11, 2025

సోమవారం నుంచి మళ్లీ యథావిధిగా ప్రజావాణి

image

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించినందున రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కావున రద్దుపరిచిన ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా సోమవారం నుంచి కొనసాగించడం జరుగుతుందని RR జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News October 11, 2025

రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ కోస్తాలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 11, 2025

ఖమ్మం: బావిలో పడి రైతు మృతి

image

తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన రైతు భూక్య భద్రు (కోటి) శనివారం తన వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.