News August 21, 2025
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి 2025 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఈ.వో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించారు. వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, ఎస్పీ మణికంఠ చందోలు, JC విద్యాధరి ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. వారికి ఈవో ఆహ్వాన పత్రికలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ కోరారు.
Similar News
News August 21, 2025
ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు: చిత్తూరు SP

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతుల పొందేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ మణికంఠ గురువారం స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చామన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే సరిపోతుందన్నారు. మైక్ అనుమతులను మీసేవ కేంద్రాలలో పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
News August 21, 2025
సోషల్ మీడియాకు దూరంగా ఉండండి: కలెక్టర్

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో హాస్టల్ నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. తల్లితండ్రుల కలను నెరవేర్చడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఓ టార్గెట్ పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. విద్యపై చేసే ఖర్చు ఎప్పటికీ వృథా కాదన్నారు.
News August 20, 2025
హంద్రీనీవా కాలువను పరిశీలించిన కలెక్టర్

హంద్రీనీవా కుప్పం కెనాల్ పనులను బుధవారం చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. హంద్రీనీవా కాలువ పనులు దాదాపు పూర్తికాగా పనుల పురోగతికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో సీఎం చంద్రబాబు హంద్రీనీవా జలాలను కుప్పంకు విడుదల చేయనున్నారు. దీంతో చివరి దశలో ఉన్న పనులను త్వరతగితన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.