News January 3, 2025
కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్‌కు 228 మంది హాజరు
పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ కైలాసగిరి వద్ద పోలీస్ మైదానంలో గురువారం ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొని పర్యవేక్షించారు. 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు, ఛాతీ పరీక్షలు నిర్వహించారు. 600 మంది అభ్యర్థులకు గాను 228 మంది హజరయ్యారని ఎస్పీ తెలిపారు.
Similar News
News January 5, 2025
విశాఖ: దూరవిద్య డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్ జారీ
ఏయూ దూరవిద్య డిగ్రీ కోర్సుల పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ విజయ మోహన్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఫిబ్రవరి 12 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్ అందుబాటులో ఉంటుందన్నారు. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయని అన్నారు.
News January 5, 2025
విశాఖ: నేవీ విన్యాసాలకు హాజరైన ముఖ్యులు వీరే!
విశాఖ తీరం భారత నేవీ విన్యాసాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులు పాల్గొని హెలికాప్టర్లు ఆకృతుల్లో చేపట్టిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయలు, కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, అనకాపల్లి MP సీఎం రమేశ్, నగర మేయర్ హరి వెంకటకుమారి, MLA వంశీకృష్ణ శ్రీనివాస్, గొల్ల బాబురావు పాల్గొన్నారు.
News January 4, 2025
ఉమ్మడి విశాఖలో పలువురికి పదోన్నతులు
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఏ.ఎస్.ఐలను ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న టి.అర్జునరావు, ఎస్.శేషగిరిరావు, ఎస్.సన్యాసిరావులను అనకాపల్లి జిల్లాకు, జె.శంకరరావును అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.