News February 13, 2026
కానిస్టేబుల్ సస్పెండ్.. గెలిచిన భార్య!

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.
Similar News
News February 14, 2026
కవలలకు పేర్లు.. రామ్ చరణ్ దంపతులకు చిరు ప్రశంసలు

కవలలకు అన్వీరా దేవి, శివరామ్ అనే పేర్లు పెట్టడంపై రామ్ చరణ్-ఉపాసనను చిరంజీవి అభినందించారు. ఈ పేర్లు ఎంతో బాగున్నాయంటూ బంధువులు, స్నేహితులు, అభిమానుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ‘‘సంస్కృతి, ఆధ్యాత్మికతను మేళవించేలా పేర్లు ఉన్నాయి. చరణ్ తన నానమ్మ అంజనా దేవి పేరు నుంచి ‘దేవి’ని అన్వీరాలో జత చేయడం నా హృదయాన్ని తాకింది. దేవుడి ఆశీర్వాదాలు మీపై ఎప్పటికీ ఉంటాయి’’ అని SMలో పోస్టు చేశారు.
News February 14, 2026
T20WC: ఒమన్ ఘోర ఓటమి

కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒమన్ ఘోర ఓటమి చవిచూసింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 18 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ కలీమ్(50), మిర్జా(46) రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్ 3 వికెట్లు తీశారు. 51 బంతుల్లోనే 10 ఫోర్లు 4 సిక్సులతో 94 పరుగులు చేసిన ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
News February 14, 2026
ఏపీపీఎస్సీలో అక్రమాలపై సిట్ ఏర్పాటు

APPSC 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. CID చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ దీనికి నేతృత్వం వహించనున్నారు. ఇందులో సభ్యుడిగా CID SP కె.చక్రవర్తిని నియమించింది. దర్యాప్తు విషయంలో అన్ని అధికారాలు సిట్‌కు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 16లోగా సిట్ తన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.


