News March 23, 2025
కానూరులో వ్యభిచార గృహంపై దాడి

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Similar News
News March 24, 2025
విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

ఈనెల 27న విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రూ.75లక్షల నిధులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని మైనారిటీ నేతలు అందరూ పాల్గొననున్నారని చెప్పారు.
News March 24, 2025
ఈనెల 26న విజయవాడ రానున్న వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 26న విజయవాడకు రానున్నారు. YSRCP ఆధ్వర్యంలో ఈనెల 26న నగరంలోని NAC కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఇఫ్తార్ విందుకు జగన్ హాజరవుతారని ఎన్టీఆర్ జిల్లా YSRCP పార్టీ ప్రెసిడెంట్ దేవినేని అవినాశ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ముఖ్య నేతలతో చర్చించామని ఆయన తెలిపారు.
News March 24, 2025
మచిలీపట్నంలో నేడు ‘మీకోసం’ కార్యక్రమం

కృష్ణా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో కోరారు. ఉదయం 11 గంటల నుంచి సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.