News August 18, 2025

కానూరు-మచిలీపట్నం రోడ్డు విస్తరణతో ట్రాఫిక్‌కు చెక్

image

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మంత్రి లోకేశ్ సోమవారం ఢిల్లీలో కలిశారు. కానూరు-మచిలీపట్నం రహదారిని విస్తరిస్తే విజయవాడ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, రాజధాని అభివృద్ధికి తోడ్పడుతుందని లోకేశ్ వివరించారు. అలాగే, హైదరాబాద్-అమరావతి అనుసంధానంలో ముఖ్యమైన NH-65లో అదనపు పోర్టు లింకేజీని DPRలో చేర్చాలని కోరారు. గ్రీన్ కారిడార్లు, టోలింగ్, ట్రాఫిక్ వ్యవస్థల అభివృద్ధిలో కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News August 18, 2025

శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలి: కలెక్టర్ తేజస్

image

భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఇళ్లను గుర్తించి ఖాళీ చేయించాలని అధికారులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. అలాగే, నీటి ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

News August 18, 2025

హార్ట్‌ఎటాక్‌ను 12ఏళ్ల ముందే గుర్తించొచ్చు!

image

గుండెపోటు సంభవించడానికి పుష్కరం ముందే కొన్ని సంకేతాలు వస్తాయని అమెరికా హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. ఏటా ఓపిక తగ్గుతూ ఉంటే మీ గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం. ‘5KMPH వేగంతో నడవటానికీ ఇబ్బందిపడటం. చిన్న పనులు, వ్యాయామం చేసినా త్వరగా అలసిపోవడం, ఊపిరి ఆడకపోవడం’ వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి. వేగంగా నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

News August 18, 2025

నష్టంపై నివేదికలు సిద్ధం చేయండి: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై విభాగాల వారీగా పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పర్యటనపై సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.