News February 8, 2025
కాప్రా: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738990442180_51938607-normal-WIFI.webp)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022లో పెన్షన్ కోసం పలువురు వృద్ధులు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక మంజూరు కావడం మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News February 8, 2025
అనపర్తి MLA కుమారుడి పెళ్లికి హాజరైన CM
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739000122219_1221-normal-WIFI.webp)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ హల్లో అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్- సుమేఘరెడ్డిల వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. అనంతరం MLAతో కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News February 8, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ డీఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738999998363_1259-normal-WIFI.webp)
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ డీఎస్పీ మధనం గంగాధర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. గీతా భవన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. అనంతరం కలెక్టర్ పమేల సత్పత్తికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంబేడ్కర్ ఆశయసాధనే తన లక్ష్యమని గంగాధర్ తెలిపారు.
News February 8, 2025
ఎవరీ పర్వేశ్ వర్మ?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739000264115_81-normal-WIFI.webp)
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్వేశ్ వర్మ మట్టికరిపించిన విషయం తెలిసిందే. జాట్ సామాజిక వర్గానికి చెందిన 47 ఏళ్ల పర్వేశ్ ఢిల్లీ మాజీ CM సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. 2013లో మెహరౌలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 2014- 2024 వరకు వెస్ట్ ఢిల్లీ MPగా పనిచేశారు. కేజ్రీవాల్‌పై గెలుపు నేపథ్యంలో ఈయన పేరును CM అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.