News August 25, 2025

కాప్రా: స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం

image

మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని పద్మశాలి టౌన్‌షిప్‌లోని స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో స్క్రాప్ తగలబడడంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News August 25, 2025

HYD మొత్తం వేరు.. జూబ్లీహిల్స్‌లో కథ వేరు

image

నగరం మొత్తం వినాయక చవితి వేడుకల్లో మునిగి ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రం రాజకీయ కార్యకలాపాల్లో బిజీ బిజీగా ఉంది. ఇక్కడ ఏ పార్టీ నాయకుడు కలిసినా ‘మనకు ఎన్ని ఓట్లు వస్తాయి..’ అనే అడుగుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో ఆత్మీయ సమ్మేళనాలు, దావత్‌లు ఘనంగా జరిపేందుకు ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సమ్మేళనాల బాధ్యతలు స్థానిక నాయకులకు అప్పగించి వారి ఓటు బ్యాంకును పటిష్ఠం చేసుకునే పనిలోపడ్డారు.

News August 25, 2025

స్నేహమే సక్సెస్ కీ.. నలుగురికీ టీచర్ ఉద్యోగాలు

image

నలుగురూ ఫ్రెండ్స్. కర్నూలు బి క్యాంప్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని డీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. ఫలితాల్లో అందరూ ఉద్యోగాలు సాధించడంతో వారి ఆనంధానికి అవధుల్లేవు. గూడూరు గ్రామానికి చెందిన జి.వెంకటేశ్(85.9), అమడగుంట్ల గ్రామానికి చెందిన జి.ఉపేంద్ర(83.7), బెల్లల్ గ్రామానికి చెందిన ఎం.విజయ్ కుమార్(80.3), వై.సురేంద్ర(77.1) ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఈ విజయంపై తల్లిదండ్రులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.

News August 25, 2025

ATP: ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

image

వజ్రకరూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పామిడికి చెందిన బాబా ఫక్రుద్దీన్, ఫరూక్, నజీర్ ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు. ఉరవకొండ నుంచి పామిడికి వెళ్తుండగా ఓ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో ఉరవకొండకు తరలించగా నజీర్ (20) మార్గ మధ్యలో మృతి చెందాడు. మరొకరు అనంతపురంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.