News July 3, 2024

కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ: జగ్గారెడ్డి

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. రాహుల్ గాంధీ కుటుంబానికి త్యాగాల చరిత్ర ఉందని, మోసాల చరిత్ర బీజేపీ, మోదీదేనని ఎద్దేవా చేశారు. త్వరలో దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీశ్ దయతో మోదీ ప్రధాని అయ్యారని విమర్శించారు.

Similar News

News February 27, 2026

తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

image

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు

News February 26, 2026

మెదక్: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 98.26% హాజరు

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాల్లో మొత్తం 98.26% మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4850 మంది, ఒకేషనల్ విభాగంలో 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, గైర్హాజరైన 95 మంది విద్యార్థుల వివరాలను వెల్లడించారు.

News February 26, 2026

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు రెండు పెట్రోల్ బంకులు: ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) నుంచి రెండు పెట్రోల్ బంకులు మంజూరైనట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. వీటిలో ఒకటి శంకరంపేట్(ఆర్) మండల కేంద్రంలో, మరొకటి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన(ఆవుసులపల్లి) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శంకరంపేట్(ఆర్)లో బంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మిగతావి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.